7 డిసెంబర్, 2012

సురకాంత పాదం | Telugu Poetry


పాదం,
సురకాంత సువర్ణపు ఈ పాదం,
రమణీయ రవివోలు ఈ పాదం,
పులకరించిన పుష్పం ఈ పాదం,
కవితాన్కిత అందం ఈ పాదం.


స్పూర్తినిచ్చిన చిత్రం  

3 నవంబర్, 2012

ఒంటరితనపు ఆవేదన | Telugu Poetry

చికటితో  స్నేహం,
మౌనంతో సంభాషణ,
అతని ఒంటరితనపు కాలక్షేపం... 

ఒకే ఓక్క నాధుడైన కన్నీరు కూడా  తనను వీడేటపుడు భాధపడింది...
ఇంకోనాళ్లు భ్రతకాలన ఆశ  కూడా తనని ప్రశ్నించింది... 
ధైర్యం చెప్పిన గుండె చపుడు కూడా వీడే సమయం వచ్చిందని తెలుపగా,
గతి లేని స్థితిలో చిత్తిలో కలిసాడు...


పుటుక ప్రశ్నగా మారినపుడు, మరణం జవాబు కాకూడదు...
పుట్టుకకు  లేని అధికారం, మరణానికి రాకూడదు...

23 అక్టోబర్, 2012

అమ్మ నాన్న | Telugu Poetry


ఎపుడు చల్లగా ఉండే చందమామ, అపుడపుడు నచ్చే సూర్యుడు, అమ్మ, నాన్న లాంటివి...

గోరు ముధలు పెట్టె అమ్మ అంటే పిల్లలకి చాల ఇష్టం,
           పిల్లల ఆకలి తిరిందాన్ని తండ్రి కళ్ళలో మాత్రమే ప్రేమ కనిపిస్తుంది..
 
 అడగానే డభులు ఇస్తుంది అమ్మ,
            అడకుండానే జాగ్రతలు చెప్తాడు తండ్రి..

నలుగురితో ఎలా ప్రవర్తించాలో నేర్పుతుంది అమ్మ,
            పది మందిలో ఒకడివి అవాలని తండ్రి తపన్న..

ఇంట్లో తినలేదనే అమ్మ మాటల్లో, మంచి వంట తినట్లేదని ఆవేదన,

            బయట తినడానికి ఒపుక్కున నాన్నమాత్రం సమయానికి తిన్నాడనే ఆలోచన..

పిల్లలు, తనకంటే ఎదిగారు అని అమ్మ చెపుకుంటుంది,
            ఎక్కడ ఎధగడ్డం అపెస్తరేమో అని, నాన్న తలవంచ్చడు

అమ్మ అంతులేని మమకారం చూపిస్తే,
            నాన్న, నాగరికపు నావ్వలో ప్రయాణం నేర్పుతాడు

జగం తెలియని పిలల్లకు వరం అమ్మ, నాన్న,
మనకి ఊహ తెలియని వయస్సు నుండే మనల్ని నిస్వార్ధంగా ప్రేమించారు,

సమాజం అనే పధం పుస్తకాలకే పరిమితం అయిపోయింది,
ప్రపంచంలో అందరూ ఎక్కాకిగానే భ్రతుకుతునార్రు
అందుకే నాకు తెలిసి, మన అమ్మ నాన్నను ప్రేమించే ముందు గౌరవించాలి
 
 

భుగోళ్ళ ఉశ్నీకరణము | Global Warming | Telugu Poetry


వరుణ కరుణ కానరాక,
ఆరుణ కిరణ తాళలేక,
మానవుడి ఆవేదన,
తనకు తాను చేసుకున వంచ్చన


దేవుడు ఇచ్చిన చెల్లెలు | Telugu Poetry


మౌనంలో నడిచె నా జీవితంలో అలజడి రేపి సందడి చెసావు ...
 
జీవితానికి అర్థం, పరమార్థం తెలిసినా, దారి తెలియని ఎడారిలో దారి చూపి సహాయపడుతునావ్...
 
తొలకరి చినుకులా నీ నవ్వు, అగ్ని గుండమైన నా కొపాని చలారుస్తుంది...

నాలో విసుగుని విరిచ్చి, చిరాకుని చెరచి, అనుభందంలో అనుభవగ్నుడిగా మార్చావు...
 
దీపంలా నీ వెలుగు నీకు తెలియకపోయినా, అ వెలుగులో నడిచె నాకు నీవు, చేల్లెలివై ఉండడం నా అదృష్టం.
 
నీ అన్నయ..... శ్రీహర్ష

విప్లవానికి నాంది | Telugu Peotry


నిసహాయానికి అసహనం తోడైతే, ఆకలి చావులకి అర్థం పలుకును...
తెల్లని జెండా, రక్తపు కనీరు పులుముకుని ఎర్రగా మారును.....
కారుణ్యం చూపు కళ్ళు, కసితొ కదిలినపుడు విప్లవానికి నాంది పలుకును.

పేధవాడి ఆక్రనంధన | Telugu Poetry

పేధవాడి ఆక్రనంధన

ఎనాళ్ళని... ఎనాళ్ళని...
అలుపెరగని కష్టాలని,
నీడకున్న భయాని,
నాడికిలేని ధైర్యాని,
రాలేని సహాయాని,
వేచి చూసే కనులని,
పొంగుతున కోపాని,
నిలువని  నిశ్చింతని,

తగన్ని... తగన్ని...
మంచికి కూడా రోజోస్తుందని...


ఆపలేని మౌనాని,
చిందించిన రక్తాని,
తాకటు పెటలేని అభిమానాన్ని,
కార్చిన కనీరుని,

నిలిచుండని... నిలిచుండని...
మంచికి కూడా రోజోస్తుందని...కుళ్ళుతున ధేహాని,
నీరుకారుతున ప్రాణాని,
అలిసిపోయిన స్వాసని,
అందలేని దేవుడ్ని,

పలకని... పలకని...    
మంచికి కూడా రోజోస్తుందని...


కానరాని సత్యాని,
అంతులేని భాధన్ని,
స్తంబించిన హృదయాని,
కడుపునిండా కలలని,

చెపని... చెపని...
మంచికి కూడా రోజోస్తుందని...కాలకూట విషాని,
భరించలేని మనసుని,

అరవని... అరవని...    
మంచికి నేడే రోజని...